Friday, November 22, 2024

లాక్ డౌన్‌పై నిర్ణయాధికారం రాష్ట్రాలదే..

సంక్రాంతి పండుగ తర్వాత పరిస్థితులను బట్టి దేశంలో లాక్‌డౌన్‌ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే ఈ లోగా పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌ విధింపు, ఆంక్షలు విధించడం తదితర పూర్తి అధికారాలను రాష్ట్రాలకే ఉన్నాయన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌, ఆంక్షలు విధించుకోవచ్చన్నారు. ఇప్పటి వరకైతే లాక్‌డౌన్‌ ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. త్వరలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మాట్లాడతారని తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి : రాజ’గతేడాదిలాగే పవర్‌ ‘ ఫుల్‌ ‘ డిమాండ్‌..

దేశంలో కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాలైనా కొవిడ్‌ మెడిసిన్‌, ఎక్విప్‌మెంట్‌ ఎగుమతులు నిలిపివేసినట్లు చెప్పారు. సోమవారం గాంధీ ఆస్పత్రిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. దేశంలో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ప్రభావం పెరిగిందన్నారు. కరోనా టీకా తీసుకున్న వారికి ముప్పు లేదని చెప్పారు. టీకాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు యువత దేశంలో 8 కోట్ల మంది ఉన్నారని, వారిలో ఇప్పటికే రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement