ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య పేరుతో చేపట్టిన దండయాత్ర ప్రారంభమై దాదాపు రెండున్నర నెలలవుతోంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ఈ యుద్ధంలో 3,381మంది సాధారణ పౌరులు మరణించారు. కానీ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల విభాగం ఈ లెక్కలను తోసిపుచ్చుతోంది. వాస్తవ మృతుల సంఖ్య అదికారిక లెక్కలకంటే వెయ్యిరెట్లు అధికమని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఐరాస మానవహక్కుల విభాగం (ఉక్రెయిన్) దేశవ్యాప్తంగా 55 ప్రాంతాల్లో నిఘాకేంద్రాలను ఏర్పాటు చేసింది. రష్యా ప్రయోగించిన క్షిపణులు, రాకెట్లు, బాంబుల విధ్వంసంవల్లే ఎక్కువమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని తేల్చింది. మృతులు, గాయపడినవారి సంఖ్య అపరిమితంగా ఉందని ఆ విభాగం అదికారి మటిల్డా బొగ్నెర్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..