Friday, November 22, 2024

రేప‌టితో ఓటర్‌ నమోదుకు ముగియ‌నున్న‌ గడువు.. వెల్లువెత్తిన అప్లికేషన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శాసనసభ ఎన్నికల కోసం రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం తుది దశకు చేరుకున్నది. ప్రతి ఏటా ఒక విడత ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతుండగా.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాదిలో రెండో విడత కూడా చేపట్టారు. రెండో విడత ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 21వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. రాష్ట్రంలో ఓటర్లు 3.6 కోట్లకు చేరువయ్యారు. ప్రత్యేక సవరణ తర్వాత ఓటర్ల సంఖ్య పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఇందులో పురుషులు 1.53కోట్లు, మహిళా ఓటర్లు 1.52కోట్లుగా ఉన్నారు.

వీరిలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 4.76లక్షలుకాగా, ట్రాన్స్‌ జెండర్లు 2133, ఎన్నారైలు 2742, సర్వీస్‌ ఓటర్లు 15337మంది ఉన్నారు. మరోసారి ఓటర్ల జాబితా వార్షిక ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 4న తుది జాబితా వెల్లడించనున్నారు. 2023 జనవరి 1నాటికి 18ఏళ్లు నిండిన పౌరులందరికీ ఓటర్లుగా నమోదు చేసుకునేలా ఈసీ చర్యలు ఆరంభించింది.

ఓటర్లు తమ పేరుఓటర్‌ జాబితాలో ఉందో లేదో చూసుకుని అభ్యంతరాలు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. పేర్లు లేకపోయినా, గల్లంతైనా మళ్లి ఫారం-6 సమర్పించి ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని ఈసి పిలుపునిచ్చింది. ఈ దఫా ఓటర్ల నమోదులో కొత్తగా 18ఏళ్లు నిండిన తొలిసారి ఓటర్లు పలువురు జాబితాలో చేరనున్నారు. ముసాయిదా జాబితా నాటికి ఓటర్ల సంఖ్య 3.6కోట్లకుపైగా ఉన్నది. నియోజకవర్గం, చిరునామా, పేర్ల మార్పులకు అవకాశమివ్వడంతో భారీగా దరఖాస్తులు రానున్నాయి.

దరఖాస్తుల స్వీకరణ తర్వాత బూత్‌ లెవల్‌నుంచి పరిశీలన కొనసాగిస్తారు. పేర్లు లేకపోయినా, గల్లంతైనా మళ్లి ఫారం-6 సమర్పించి ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని ఈసి పిలుపునిచ్చింది. మొత్తం అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించి పరిశీలించేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అనుబంధ ఓటర్ల జాబితాను, అక్టోబర్‌ 4న తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రచురించనుంది. త్వరలో జరగనున్న అసెంబ్లి ఎన్నికల్లో నూతన జాబితానే వినియోగిస్తారు.

- Advertisement -

18లక్షలకుపైగా అప్లికేషన్లు…

ముసాయిదా ప్రకటన వరకు అధికారుల వద్ద లక్షా 91 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌ లో ఉన్నాయి. వాటిని కలిపితే ఇప్పటి వరకు మొత్తం 18 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో కొత్తగా ఓటు-హక్కు నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య తొమ్మిది లక్షలకు పైగా ఉంది. జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించి మూడున్నర లక్షల వరకు దరఖాస్తులు అందాయి.

ఇక చిరునామా మార్పు, ఓటర్లు బదలాయింపు, సవరణలకు సంబంధించి ఐదున్నర లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు ఇప్పటికే కసరత్తు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వినతులు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. వచ్చిన దరఖాస్తుల పరిశీలనను మొదలు పెట్టనున్నారు. ఆ తర్వాత అర్హులకును గుర్తించి తుది జాబితాలో చోటు కల్పిస్తారు.

తొలగింపులకు 3లక్షల దరఖాస్తులు…

జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించి మూడున్నర లక్షల వరకు దరఖాస్తులు అందాయి. ఇక చిరునామా మార్పు, ఓటర్లు బదలాయింపు, సవరణలకు సంబంధించి ఐదున్నర లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు ఇప్పటికే కసరత్తు కొనసాగిస్తున్నారు. రెండో విడత ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 21వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు.

వచ్చిన అన్ని దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ లోపు పరిష్కరించాల్సి ఉంది. ఆ తర్వాత సిద్ధమైన జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో అక్టోబర్‌ 4న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ ఓటరు జాబితా ప్రకారమే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకవేళ ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పేర్లను అనుబంధ జాబితాలో ప్రకటిస్తారు.

వచ్చే నెలలో సీఈసీ పర్యటన..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కసరత్తు వేగవంతంగా ముందుకు సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేయాల్సిన పనులను తొందరగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తోంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెల 3నుంచి నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. మూడు రోజుల పాటు- హైదరాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు- రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది.

అక్టోబర్‌ మూడో తేదీన జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణాపరమైన అంశాలపై చర్చించనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2వ ప్రత్యేక సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) ముసాయిదా జాబితాను ప్రచురించినట్లు తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ వికాస్‌ రాజ్‌ తెలిపారు. డ్రాప్ట్‌ రోల్‌ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333 కాగా, ఇందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళా ఓటర్లు, 2,133 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 35,356. 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్ల సంఖ్య 4,76,597గా ఉంది. సెప్టెంబర్‌ 28న అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరించి అక్టోబర్‌ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితానే వినియోగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement