Monday, November 25, 2024

TS | రేపటితో ముగియనున్న పోస్టల్‌ బ్యాలెట్ దరఖాస్తుల గడువు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటినుంచే పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులతోపాటు దివ్యాంగులు పలు ఇతరులకు ఇంటివద్దనుంచే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అదేతరహాలో పోస్టల్‌ బ్యాలెట్‌కూ ఈ దఫా అవకాశాలను విస్తృతం చేసింది. అయితే బుధవారం దరఖాస్తుకు గడుదు తీరనుండటంతో దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ ఈసీ అప్రమత్తం చేసింది. తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న జరిగే ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్టులు, 12 ఇతర విభాగాల ఉద్యోగులకు ఈసీ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించింది.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా వృద్ధులు, దివ్యాంగులతోపాటు 13 రకాల అత్యవసర సేవల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఎఫ్‌సీఐ, ఎఎఐ, పీఐబీ, విద్యుత్‌ శాఖ, రైల్వే, వైద్యరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, పౌరసరాఫరాల శాఖ, బీఎస్‌ యన్‌ఎల్‌, వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్‌ పొందిన జర్నలిస్టులు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, దూరదర్శన్‌, పీఐబీ, ఆల్‌ ఇండియా రేడియో, ఆర్టీసీ ఫైర్‌ సిబ్బందికి కొత్తగా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించారు.

- Advertisement -

వీరంతా మంగళవారంలోగా తేదీలోగా ఫారం-12డీకి దరఖాస్తు చేయాలి. వీరంతా ఇంటినుంచే ఓటువేసే సదుపాయం తద్వారా పొందనున్నారు. అయితే ఇంటివదవ్దనుంచే ఓటుతోపాటు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానిఇ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీఎల్‌ఓల ద్వారా ఫారం 12డీ సమర్పిస్తే అధికారులు పరిశీలించి ఇంటివద్దే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్‌ శాతం పెంచే లక్ష్యంతో ఎన్నికల సంఘం తాజా చర్యలు తీసుకుంటోంది.

ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ఆయా విభాగాల ఉద్యోగులు తగిన పత్రాలతో రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో తొలి విభాగంలో సైన్యంలో పనిచేసే సిబ్బందిని సర్వీస్‌ ఓటర్లుగా పేర్కొని అవకాశం ఇవ్వనుండగా, ప్రత్యేక ఓటర్లకింద రాష్ట్రపతి ఇతర కార్యాలయాల ఉద్యోగులకు రెండో విభాగం కింద అవకాశం కల్పించనున్నారు. పీడి యాక్టుకింద అరెస్టయిన వారు మూడో విభాగం కింద పోస్టల్‌ బ్యాలెట్‌ సేవలను వినియోగించుకునే వెసులుబాటు అమలులోకి రానున్నది.

ఇక నాలుగో విభాగంలో ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు, సిబ్బంది ఉండనున్నారు. అయిదో విభాగం కింద నోటిఫైడ్‌ ఓటర్లు అంటే 80ఏళ్లుపైబడిన వృద్ధులు, 40శాతానికి మించి వైకల్యం కల్గిన 21 రకాల దివ్యాంగులకు అవకాశం దక్కనుంది. వీరందరి ఇండ్ల వద్దకు బూత్‌ లెవల్‌ అధికారులు వచ్చి ఓటు వేసేందుకుగానూ ఫారం 12డీ ఇవ్వనున్నారు. ఒకసారి ఆర్వో అనుమతి వచ్చిన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ పొందిన ఓటర్‌ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసేందుకు అవకాశం ఉండదు.

నోటిఫైడ్‌ ఓటర్ల జాబితాలో ఎన్నికల విధులను నిర్వహిగంచే ఉద్యోగులకు కూడా పోస్టల్‌ ఓటు వెసులుబాటు కల్పించారు. గతంలో కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలోనే దేశంలో మొదటిసారిగా ఈ వెసులుబాటును అమలులోకి తెచ్చారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకునే నిర్దేశిత ఓటర్లకు పోలింగ్‌కు ముందే రెండు తేదీలలో పోస్టల్‌ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించనుంది. ఇందుకు తనకు అనుకూలమైన తేదీని ఎంచుకునే స్వేచ్చ ఓటర్‌కు ఉంటుంది.

పొలిటికల్‌ పార్టీలకు ఆయా తేదీలు, ఓటర్ల సమాయారం అందించిన తర్వాత పార్టీల ఏజెంట్లు కూడా పోస్టల్‌ ఓటు సమయంలో హాజరుకావచ్చు. ఈ మొత్తం తతంగం అంతా వీడియో తీస్తారు. ఓటర్‌ ఇంట్లో పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసి బ్యాలెట్‌ పేపర్‌ను ఓటరకు ఇస్తారు. సీక్రెట్‌ బ్యాలెట్‌ విధానంలో ఓటర్‌ తనకు నచ్చిన అభ్యర్ధికి ఓటు వేసి ఫారం 13బీలో నిక్షిప్తం చేసి సీల్‌ వేసీ ఆర్వోకు ఇవ్వాల్సి ఉంటుంది. తాను ఓటేసినట్లు ఫారం 13ఏపై సంతకం చేయాల్సి ఉండనుంది.

ఈ నెలాఖరునుంచి నూతన ఓటర్లకు ఎపిక్‌ కార్డులు…

కొత్తఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ మొదలైంది. అదేవిధంగా పోల్‌ స్లిప్పుల పంపిణీ కూడా ఆరంభమైంది. 2023 జనవరి నుంచి కొత్తగా 40 లక్షల దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. జనవరి1 నుంచి 27 లక్షలా 50 వేలకు పైగా ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి తపాలా శాఖ ద్వారా ఓటర్ల చిరునామాలకే పంపిచారు. పోలింగ్‌ నాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్లకు కార్డుల జారీ ప్రక్రియను ఈసీ వేగవంతం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement