Thursday, November 21, 2024

Spl Story: అస్స‌లు తగ్గని క్రేజ్‌.. హైదరాబాద్‌ దమ్‌ బిర్యాని అంటే మ‌స్త్ ఫేమ‌స్‌!

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : ‘‘హైదరాబాద్‌ వస్తే బిర్యాని తినకుండా వెళ్లలేక పోతున్నా… నా జీవితంలో హైదరాబాద్‌ బిర్యాని ఓ బాగమైంది’’ అని ఓ ఇంటర్వూలో చెబుతాడు ప్రముఖ క్రికెటర్​ సచిన్‌ టెండూల్కర్‌. ఒక్క సచిన్‌ టెండూల్కర్ మాత్రమే కాదు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రికెటర్లు, సినీ తారలు, సెలబ్రిటీల మెనూలో దమ్‌ బిర్యాని ఉండాల్సిందే. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు హైదరాబాద్​ బిర్యాని అంటే పడి చచ్చే వాళ్లున్నారు. హైదరాబాద్​ నగరలోని కొన్ని పేరు మోసిన హోటళ్లలో ప్లేస్‌ కోసం బయట గంటల తరబడి వేయిట్‌ చేసే వారు కూడా ఉన్నారు.

అంతటి క్రేజ్‌ ఉంది హైదరాబాద్‌ బిర్యానికి. కొవిడ్‌ కాలంలో నగరంలో పర్యాటక, హోటల్‌ రంగాలు అనుకున్న స్థాయిలో నడవక పోయినప్పటికి బిర్యాని అమ్మకాలు మాత్రం తగ్గలేదు. ప్రతి రోజు 50 వేలకు పైగా ఆర్డర్లతో కోటిన్నరకు పైగా టర్నోవర్‌తో ప్రస్తుతం ఈ స్పెషల్​ వంటకం ​ నగరంలో టాప్‌ డిష్‌గా మన్ననలు అందుకుంటోంది. స్విగ్గీ, జొమాటో తదితర అన్‌లైన్‌ ఆప్‌ల ఆర్డర్లలో సైతం నగరంలో ఈ వంటకానిదే మొదటి స్థానం అని గణాంకాలు చెబుతున్నాయి.

బిర్యాని రుచే వేరు…

హైదరాబాద్‌ బిర్యాని రుచే వేరు. ఘుమ ఘుమలాడే బిర్యానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. 400 వందల సంవ త్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ బిర్యాని మొదటి నిజాం కాలంలో ప్రపంచానికి పరిచయం అయ్యింది. నగర వాసులతో పాటు దేశ విదేశాల్లో ఈ హైదరాబాద్‌ స్పెషల్‌ వంటకం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ బిర్యాని రెండు రకాలు. ఒకటి కచ్చా… ఒకటి పక్కా. కచ్చా బిర్యానిలో పచ్చి మాంసానికి మసాల దినుసులు, పెరుగు పట్టించి బియ్యం పొరల మధ్య ఉడికిస్తారు. పక్కా బిర్యానిలో మాంసం, బియ్యం, విడివిడిగా ఉడికించి చివర్లో కలుపుతారు.

దక్కని జీఐ గుర్తింపు

- Advertisement -

అయితే, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ బిర్యానికి ఇప్పటి వరకు జియోగ్రాఫిక్‌ ఐడెంటిఫికేషన్‌ (జీఐ) దక్కలేదు. 2009లో హైదరాబాద్‌ బిర్యాని అసోసియేషన్‌ జీఐ గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ సరైన పత్రాలు చారిత్రక ఆధారాలు సమర్పించలేదని గుర్తింపు ఇవ్వలేదు. ఏదైనా ఒక వస్తువు ఒక ప్రత్యేక మైన ప్రాంతంలో దొరికితే దానికి కేంద్రం జీఐ ట్యాగ్‌ ఇస్తారు. అప్పడు ఆ ట్యాగ్‌ పొందిన వారు మాత్రమే వాడాల్సి ఉంటుంది. తెలంగాణలో గద్వాల, పోచంపల్లి చీరలకు జీఐ ట్యాగ్‌ గుర్తింపు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement