సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఓ కేసుకు సంబంధించి మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కు సంబంధించి ఆరేళ్ల కిందటి కేసులో విచారణ సందర్భంగా ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు నేడు ఈ తీర్పును ఇచ్చింది.
మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3,72,219 పరిహారం చెల్లించాలని వర్మను కోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
- Advertisement -