హైదరాబాద్, ఆంధ్రప్రభ : పర్యావరణ పనితీరు నివేదికలో భారత్ ప్రపంచంలో 180వ స్థానంలో నిలవడంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా పరిగణించాలని సూచించారు. దీనిపై తగిన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరముందని గురువారం ఆయన ట్వీట్ చేశారు.
ఎన్విరాన్‌మెంట్ ఫర్మామెన్స్ ఇండెక్స్-2022లో భారత్ కేవలం 18.9 స్కోరుతో 180వ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం లాంటి కార్యక్రమాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రప్రభుత్వం కూడా చేపట్టాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.