Tuesday, November 26, 2024

సెకండ్ లో మహిళలపై కరోనా పంజా

తెలంగాణలో కరోనా బారిన పడుతున్న మహిళల
సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గతేడాది వ్యాపించిన మొదటివేవ్ లో కంటే ఈ సారి సెకండ్ లో మహిళలు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కరోనా పేషెంట్లో మహిళల శాతం 38.5శాతంగా ఉంది. ఇదే గతేడాది మొదటి వేలో కేవలం 34శాతం మంది మహిళలు మాత్రమే కరోనా బారిన పడ్డారు. జాతీయ స్థాయి కరోనా మహిళా పేషెంట్ల కంటే
రాష్ట్రంలోనే అధికంగా మహిళలు కరోనా బారిన పడుతున్నారు. జాతీయస్థాయిలో మహిళా కరోనా పేషెంట్లు 36శాతం మాత్రమే ఉండగా…రాష్ట్రంలో అది 38.5శాతంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఐసీయూలో కేవలం 33 శాతం మంది కరోనా పేషెంట్లు మాత్రమే చికిత్స పొందేవారు.

ఇప్పుడు ఏకంగా 39శాతం మహిళా పేషెంట్లు కరోనాతో ఐసీయూ వార్డుల్లో చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉందో అర్ధమవుతోంది. సాధారణంగా పురుషులకంటే మహిళలే కరోనా జాగ్రత్తలను పాటిస్తుంటారు. పురుషుల మాదిరిగా మహిళలు ఎక్కువ సమయం ఆరుబయట గడపరని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. పైగా కరోనా సోకుతున్న మహిళల్లో యువతుల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. తెలంగాణ
తోపాటు దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా కరోనా బారిన పడుతున్నారు. బీహార్ లో దేశంలోనే అత్యధికంగా 42 శాతం మహిళలకు కరోనా సోకింది. రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న మహిళల సంఖ్య సెకండ్ లో పెరుగుతోంది. కరోనా సోకడంతో ఐసీయూలో పెద్ద సంఖ్యలో మహిళా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల్లోనూ 50శాతం మహిళా పేషెంట్లే ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement