Wednesday, November 27, 2024

TG | దిలావర్ పూర్ కొనసాగుతున్న ఆందోళనలు.. భారీగా మొహరించిన పోలీసులు

నిర్మల్ ప్రతినిధి, నవంబర్ 27 (ఆంధ్రప్రభ న్యూస్) : ఇథ‌నాల్ ఫ్యాక్టరీ ఎత్తివేయాలని గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళన రోజు రోజుకు ఉదృతమ‌వుతుంది. దిలావర్ పూర్ బన్సపల్లి గ్రామస్తుల నిరసనలు తారస్థాయికి చేరాయి. గతరాత్రి రైతులు, గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో బుధవారం ఉదయం నుండి దిలావర్ పూర్ మండల కేంద్రంలోని రైతులను పోలీసులు తరమడంతో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి.

ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న పరిస్థితులు మండల కేంద్రంలో నెలకొన్నాయి. కొందరు రైతులు, ప్రజలు చేతిలో క్రిమిసంహారక మందుల డబ్బాలు చేతిలో పట్టుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో నిలిపివేసేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement