అంతర్జాతీయంగా చమురు ధరలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ తయారీసంస్థ ఎంజీ మోటార్స్ త్వరలో ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. ఈ కారును మనదేశంలో కూడా లాంచ్ చేయనున్నారు. రూ.10లక్షల కంటే తక్కువ ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు.
చైనాకు చెందిన వులింగ్ గ్లోబల్ కంపెనీతో కలిసి ఇంగ్లండ్‌కు చెందిన ఎంజీ మోటార్స్ ఈ కారును విడుదల చేయనుంది. వులింగ్ కంపెనీకి చెందిన హాంగ్‌గ్వాంగ్ మినీ ఈవీను పోలీన ఈ కారులో 20కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు పయనిస్తుంది. ఈ కారు వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం భారత్‌లో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా టాటా టిగోర్ ఈవీ ధర రూ.11.99లక్షలు ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..