Sunday, November 10, 2024

ఉత్పత్తి ఇండియాలో… ఉద్యోగాలు చైనా వాళ్లకా? టెస్లాకు సడలింపుల్లేవన్న కేంద్రం..

భారత్‌లో తయారీ కార్యకలాపాల్లో పాల్గొంటే తప్ప ఎలాంటి రాయితీలు, సడలింపులు ఉండబోవని అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లాకు కేంద్ర ప్రభుతం స్పష్టత ఇచ్చింది. మార్కెట్‌ అంటే ఉద్యోగ కల్పన ఉండాలని, ఇక్కడ మార్కెటింగ్‌ చేసుకుంటూ చైనాలో ఉద్యోగాలు సృష్టిస్తుంటే భారత్‌లో కంపెనీకి ఎలాంటి అవకాశాలు ఉండవని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్‌ పాల్‌ గుర్జార్‌ తేల్చి చెప్పారు. ప్రభుత విధానం ప్రకారం.. కంపెనీ ఇంకా స్కీం కోసం దరఖాస్తు చేసుకోలేదన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో.. సభ్యులు అడిగిన ప్రశ్నకు టెస్లా రాకపై మంత్రి గుర్జార్‌ స్పష్టత ఇచ్చారు. గతేడాది ఎలన్‌ మస్క్‌ నేతృతంలోని కంపెనీ.. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరింది. అయితే ఏదైనా పన్ను రాయితీలను పరిగణలోకి తీసుకునే మందు దేశంలో ఐకానిక్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని ప్రారంభించాలని భారీ పరిశ్రమల మంత్రిత శాఖ టెస్లాకు సూచించింది.

రాయితీలు అందిస్తాం..

ఆటో మొబైల్స్‌, ఆటో కాంపోనెంట్స్‌తో పాటు అడ్వాన్స్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ) బ్యాటరీని తయారు చేయడానికి ప్రభుతం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలను కలిగి ఉందని గుర్జార్‌ తెలిపారు. రెండు స్కీంలు దేశీయ, విదేశీ సంస్థల కోసం తీసుకొచ్చామన్నారు. టెస్లాపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. కంపెనీకి చైనా మార్కెట్‌ నుంచి కార్మికులు కావాలి. మోడీ ప్రభుత్వంలో ఇది సాధ్యం కాదు. తమ ప్రభుత విధానం భారతదేశ మార్కెట్‌ను ఉపయోగించుకోవాలంటే.. ఇక్కడి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తి ఇక్కడ చేసుకుంటూ.. చైనా వాళ్లకు ఉద్యోగాలివ్వబోం. భారతీయులకు ఉద్యోగాలు కల్పిస్తేనే.. టెస్లాకు అన్ని రకాలుగా సహాయం అందిస్తాం. భారత్‌ మార్కెట్‌లో టెస్లాను ఆహ్వానిస్తే.. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పెరుగుతుందని, కాలుష్యం తగ్గుతుందని, భారతీయ మార్కెట్‌లో టెస్లా రాక ఆలస్యానికి కారణం ఏంటని.. కాంగ్రెస్‌ సభ్యుడు కే సురేష్‌.. అడిగిన ప్రశ్నకు కేంద్రం మంత్రి గుజ్జర్‌ క్లారిటీ ఇచ్చారు.

పాలసీ ప్రకారం నడుచుకోవాలి..

భారత్‌ డబ్బు.. చైనాకు వెళ్లాలంటే సభ్యుడిని అడగాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం టెస్లా దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఇక్కడి విధానాలకు అనుగుణంగా సంస్థ ప్రారంభించాలనుకుంటే.. టెస్లాకు తలుపులు తెరిచే ఉంటాయని వివరించారు. ఇక్కడి పాలసీ ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు అని, కంపెనీ ఏర్పాటు చేసుకోవచ్చని, ఇక్కడి ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వొచ్చని అన్నారు. కంపెనీ వస్తే.. భారత్‌ ఆదాయం పెరగాలని, అంతేగానీ.. చైనా ఆదాయం పెరగాలని అనుకోవడం లేదని తెలిపారు. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం నుంచి తీవ్ర ఛాలెంజ్‌లు ఎదురవుతున్నాయంటూ గత నెల్లో టెస్లా ఫౌండర్‌, సీఈఓ ఎలన్‌ మస్క్‌ చెప్పుకొచ్చారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement