Friday, November 22, 2024

వారంలో నాలుగురోజులే పనిదినాలు…క్లారిటీ ఇచ్చిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాల తగ్గింపుపై క్లారిటీ వచ్చింది. ఒక వారంలో నాలుగు రోజులు పని దినాలు లేదా నలభై పనిగంటలు ప్రవేశపెట్టే ఆలోచన పూర్తిగా లేదని కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పని దినాలు, సెలవులు, పని గంటల పై వేతన సంఘం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నాలుగో వేతన సిఫార్సుల ఆధారంగా వారంలో ఐదు రోజుల పని దినాలు, రోజులో 8.5 పని గంటలను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement