Monday, November 25, 2024

45 ఏళ్ళు పైబడిన ప్రతివారు ఇక వాక్సిన్ కి అర్హులే

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విచ్చల విడిగా వ్యాప్తి చెందుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ జనాలకు ఉపశమనం ఇచ్చే విధంగా ఓ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ళు పైబడిన వారు కూడా వాక్సిన్ తీసుకోవచ్చని ప్రకటించారు. అర్హత ఉన్నవారంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుని టీకాలు వేసుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.

జనవరి 16 నుంచి మొదలైన ఈ మొదటి దశ టీకా కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి ప్రాధాన్యం ఇచ్చారు. మార్చి ఒకటి నుంచి ప్రభుత్వం రెండో దశను ప్రారంభించింది. దీనికి కింద 60 ఏళ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 నుంచి 59 సంవత్సరాల వారికి టీకా ఇస్తున్నారు. తాజాగా ఇప్పుడు 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి టీకా వేసుకోవచ్చని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement