Wednesday, November 20, 2024

రైతు భరోసా కేంద్రాలకు కేంద్రం ప్రశంస.. సేవలన్నీఒకే చోట దొరుకుతున్నాయని వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రైతుల అవసరాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) వన్‌-స్టాప్‌ సొల్యూషన్‌గా పని చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రశంసించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ముందుగా పరీక్షించిన వ్యవసాయ ఉత్పాదనల సరఫరా నుంచి వివిధ సేవలు, సామర్ధ్యం పెంపు చర్యలు, సాగుకు సంబంధించిన పరిజ్ఞానం ప్రచారం వంటి రైతాంగ అవసరాలన్నింటికి రైతు భరోసా కేంద్రాలు వన్‌-స్టాప్‌ సొల్యూషన్‌లా పని చేస్తున్నట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం కూడా అగ్రి క్లినిక్‌లు, అగ్రి బిజినెస్‌ సెంటర్ల ఏర్పాటు, రైతులకు భూసార ఆరోగ్య కార్డుల పంపిణీ వంటి రైతాంగానికి ఉపయోగపడే పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతాంగం మేలు కోసం వివిధ రాష్ట్రాలు అమలు చేసే పథకాలు, విధానాలను పరిగణలోకి తీసుకుంటూ వాటి   ఆధారంగా పథకాల రూపకల్పన చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement