Tuesday, November 26, 2024

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకే కేంద్రం మెగ్గు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపుతుంది. లాభాలు వస్తున్నాయి అంటూనే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నట్లు కేంద్రం మరోసారి పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్రం మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ద్వారా 913-19 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కేంద్రం వివరించింది.

సోమవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి లిఖతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇదిలావుండగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ కార్మిక సంఘాలు పోరాటం కొనసాగిస్తున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం అనేసార్లు విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement