కేంద్రం 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుతరంగ బ్యాంకులకు కేంద్రం రూ.15వేల కోట్ల అదనపు మూలధనాన్ని సమకూర్చనుంది. మార్చి రెండోవారంలో ఈ మొత్తాన్ని ఆర్థికంగా బలహీనంగా ఉన్న బ్యాంకులకు అందించనుంది. ఆయా బ్యాంకుల క్యాపిటల్ రిజర్ రిక్వైర్‌మెంట్‌కు అనుగుణంగా ఈ మొత్తాన్ని అందజేయనుంది. ఈ మొత్తంలో అధికభాగం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లకు అందనుంది. కాగా గతేడాది వడ్డీరహిత బాండ్స్ జారీ ద్వారా నిధులు సమకూర్చుకున్న బ్యాంకులకు ఈ అదనపు మూలధనం అందనుంది. అయితే బాండ్స్ వ్యాల్యుయేషన్‌ను ముఖవిలువ కంటే తక్కువగా లెక్కించినట్లు ఆర్బీఐ అభిప్రాయపడింది. పీఎస్‌బీలకు ప్రభుతం అదనపు మూలధనం సమకూర్చాల్సి ఉండటంతో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రూ.4600 కోట్ల ఈకీటీ మూలధన సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ప్రిపరెన్షియల్ పద్ధతిలో ప్రభుత్వానికి షేర్ల కేటాయింపు ద్వారా నిధులను సమీకరించనుంది. 2022-23ఆర్థిక సంవత్సరానికిగాను గతంలో అంచనావేసిన రూ.20వేల కోట్ల మూలధన సాయాన్ని రూ.15వేల కోట్లకు సవరించారు. 2020-21 మూడో త్రైమాసికంలో వడ్డీయేతర బాండ్స్ ద్వారా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులోకి మొదటిసారి మూలధనం సమకూర్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులోకి 2021 మార్చిలో రూ.14,500కోట్లు నిధులు అందాయి. సెంట్రల్ బ్యాంకుకు రూ.4,800కోట్లు, యూకో బ్యాంక్‌లోకి రూ.2600 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి రూ.3వేల కోట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి రూ.4100కోట్లు అందజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..