కనీస మద్దతు ధరకు సంబంధించి కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ‘ఢిల్లీ చలో’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రైతులకు కేంద్రం కీలక పిలుపునిచ్చింది. రైతు సంఘాలను చర్చలకు కేంద్రం పిలిచింది.
రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదారి పట్టొద్దని సూచించింది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించొద్దని కోరింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాని స్పష్టం చేసింది. కాగా నిన్నటి నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనే ఉన్నారు. ఢిల్లీలోకి భారీగా వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు.