వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయిన బాలుడి ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఇట్లాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, అధికారులను అప్రమత్తం చేస్తున్నట్టు తెలిపారు. అయితే.. ఈ దారుణ ఘటనలో బాలుడి చనిపోయిన విషయమై తెలంగాణ హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. కాగా, ఇవ్వాల (బుధవారం) ఒక్కరోజే హైదరాబాద్‌లో రెండు చోట్ల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క కుక్కకాటు ఘటనలు జరిగాయి.
ఇక.. గ్రైటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు వీధికుక్కల విషయంలో సీరియస్ యాక్షన్ ప్లాన్ తీసుకోబుతున్నట్టు తెలిపారు. స్కూళ్లు, మార్కెట్ ప్రదేశాల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓ కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీని కోసం 040-2111111 హెల్ప్ లైన్‌కి ఎప్పుడైనా కల్ చేసి కంప్లెయింట్ చేయవచ్చని సూచించారు. దీంతో కుక్కలు ఎక్కువగా ఉండే చోట్లకు జీహెచ్ ఎంసీ సిబ్బంది వచ్చి వాటిని తీసుకెళ్తారని, కుక్కల సంతతి పెరగకుండా చర్యలు తీసకుంటారని అధికారులు వెల్లడించారు.