Tuesday, November 26, 2024

Delhi | సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల కేసు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగులను వెనక్కి తీసుకునేందుకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌కు సుప్రీంకోర్టు జనవరి 16 వరకు గడువు ఇచ్చింది. మంగళవారం జస్టిస్ అమనుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ఏపీ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల కేసుపై విచారణ చేపట్టింది.

అనంతపురం, కర్నూలు జిల్లాకు చెందిన 14 మంది ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఇంజినీర్లను వెనక్కి తీసుకునేందుకు  సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అంగీకారం తెలిపింది. ధర్మాధికారి సిఫారసులకు విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగులను తెలంగాణకు పంపారని ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారిని వెనక్కి తీసుకునేందుకు గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జనవరి 16 వాయిదా వేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement