Friday, November 22, 2024

Big Update | శ్రీశైలంలో ఆర్జిత, సామూహిక అభిషేకాలు తాత్కాలికంగా రద్దు.. కారణం ఏంటంటే!

ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు నిజ శ్రావణమాసం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత, సామూహిక అభిషేకాలను నిర్దేశిత తేదీల్లో నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. అధిక శ్రావణంలోనూ పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చే అవకాశముందన్నారు. భారీ వర్షాల కారణంగా వచ్చే వరద నీటిని దిగువ ప్రాంతాలకు పంపేందుకు ఆగస్టులో శ్రీశైలం ఆనకట్ట గేట్లను ఓపెన్​ చేసే అవకాశం ఉండడంతో ఈ సేవల నిలుపుదల నిర్ణయాన్ని తీసుకున్నామని ఆయన చెప్పారు.

ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు వచ్చే శని, ఆది, సోమవారాలతో పాటు , స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి రోజున అభిషేకాలు, సామూహిక అభిషేకాలను నిలుపుదల చేసినట్లు ఈవో చెప్పారు. ఈ రోజుల్లో మూడు విడతల వారిగా భక్తులకు అలంకార దర్శనం , స్పర్శ దర్శనం కల్పిస్తున్నామని వెల్లడించారు.స్వామివారి స్పర్శదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా పొందవలసి ఉంటుందని అన్నారు.

ఇప్పటికే ఆగస్టు మాసపు టికెట్ల కోటాను దేవస్థానం వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టినట్టు తెలిపారు. సెప్టెంబర్ మాసపు టికెట్ల కోటాను ఆగస్టు 25 వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నిర్ధిష్ట రోజుల్లో కాకుండా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత స్పర్శదర్శనం యథావిధిగా కొనసాగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement