ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇవ్వాల (ఆదివారం) జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ పోరులో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్ చేతిలో భారత ఆటగాడు ప్రణయ్ ఓటమిచెందాడు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ ఉత్కంఠభరితమైన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఓటమిపాలైన హెచ్ఎస్ ప్రణయ్ రన్నర్ అప్ గా నిలిచాడు. ప్రపంచ 24వ ర్యాంకర్ వెంగ్‌పై 9-21 23-21 20-22 తేడాతో ఓటమితో ప్రణయ్ తన రెండో BWF టైటిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడు.
బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నం.9 స్థానంలో ఉన్న ప్రణయ్, మేలో జరిగిన మలేషియా మాస్టర్స్ సూపర్ 500లో తన తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 21-19, 13-21, 21-18తో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించి తన తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆ తరువాత ఇప్పుడు జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కూడా సొంతం చేసుకుని తన రెండవ BWF వరల్డ్ టూర్ టైటిల్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు .
కానీ, మలేషియా మాస్టర్స్ ఫైనల్ లో ప్రణయ్ ఓడించిన వెంగ్ హాంగ్ ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ ప్రణయ్ ని ఓడించగా ఈ టోర్నమెంట్ లో రన్నర్ అప్ గా నిలిచాడు భారత ఆటగాడు ప్రణయ్. ఇక, బ్యాడ్మింటన్ క్యాలెండర్లో తదుపరి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు ఆగస్టు 21న కోపెన్‌హాగన్‌లో ప్రారంభమవ్వనున్నాయి.