హైదరాబాద్ సిటీలో కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొంతమంది పబ్ యజమానులు.. అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్‌లో కొత్త మోసానికి తెరతీశారు. పబ్ యజమానులు, అమ్మాయిలు.. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకొని డబ్బులు కొట్టేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒక వ్యాపారవేత్తకు రితికా అనే యువతి పరిచయం కాగా, పరిచయం అయిన మరుసటి రోజే కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గరికి పిలిచింది. మరుసటి రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద చేరుకున్నారు. వ్యాపారవేత్తను పబ్‌లోకి తీసుకెళ్లి తియ్యని మాటలు చెప్పి గంట లోపల ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి తాగింది. ఇక.. ₹40,505 రూపాయిలు బిల్‌ను చేతిలో పెట్టి రితిక జారుకుంది. బిల్లును చూసి ఆ వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 45 వేల రూపాయల మద్యం తాగిన రితిక తూలకుండా బయటికి వెళ్లిపోవడంతో విస్మయం చెందిన వ్యాపార వేత్త.. పబ్బు యజమానులు మద్యం పేరుతో కోక్ని అమ్మాయికి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నాడు.
పబ్ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇలాగే.. ఆ యువతితో కలిసి పబ్ యాజమానులు చేసే గోల్‌మాల్‌తో చాలా మంది మోసపోయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పరిధిలోని ఈ పబ్బులో ఇలాంటి మోసాలు చాలా జరిగినట్లు గుర్తించారు. తనకు జరిగిన మోసంపైన సోషల్ మీడియాలో ఆధారాలతో సహా వ్యాపారవేత్త బయటపెట్టాడు. ఇప్పుడీ వార్త హల్చల్ అవుతోంది.