Saturday, November 23, 2024

ఇదేందయ్యా ఇది!! బస్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని అద్దాలు పగలగొట్టిన కార్ డ్రైవర్

రోడ్లపై వాహనాలు నడిపేవారు అడ్డదిడ్డంగా నడుపుతూ ఉంటారు. ఆ సమయంలో కొంతమందికి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్ రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్వేలు వద్ద బస్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదన్న కోపంతో ఓ కార్ డ్రైవర్ బస్సు అద్దాలను ధ్వంసం చేశాడు.

అంతటితో ఆగలేదు డ్రైవర్ పై దాడికి ప్రయత్నం చేశాడు. వెంటనే బస్ డ్రైవర్ ప్రయాణికులందరిని కిందకు దింపి… కార్ డ్రైవర్ ను పోలీసులు పట్టించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement