Saturday, November 23, 2024

జీవో 117 విద్యావ్యవస్థపై భారం: మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ

అమరావతి, ఆంధ్రప్రభ : పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను రేషనలైజేషన్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అన్యాయమని, విద్యావ్యవస్థ విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ విమర్శించారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎయిడెడ్‌ వ్యవస్థను ప్రభుత్వ విద్యలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేసి ప్రభుత్వం చేతులు కాల్చుకుందని అన్నారు.

ఇప్పుడు 117 జీవోను జారీ చేసి విద్యావ్యవస్థపై మోయలేని పనిభారాన్ని మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజీవో విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీయడమే కాకుండా ఉపాధ్యాయులపై తీవ్ర పనిభారాన్ని మోపుతుందని పేర్కొన్నారు. ఈ జీవో ప్రైవేట్‌ పాఠశాలకు అనుకూలంగా ఉందని రామకృష్ణ ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాలతో తక్షణమే చర్చించి జీవో 117ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement