Saturday, November 23, 2024

పెరిగిన వైద్య ఖర్చుల భారం.. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నా తప్పని తిప్పలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రోజు రోజుకు పెరిగిపోతున్న వైద్య ఖర్చుల భారంతో రాష్ట్రంలోని ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాయి. వైద్య ఖర్చుల భారం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఫలితంగా ఎన్నో కుటుంబాలు ఇళ్లు, వాకిళ్లతోపాటు ఉన్న ఎకరా, అర ఎకరాన్ని కూడా అమ్ముకుని నిలువనీడలేని, పూటగడవని పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నాయని పలు వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని ఏ మేజర్‌ గ్రామ పంచాయతీని తీసుకున్నా కనీసం 10 కుటుంబాలైనా వైద్యానికి అప్పులు చేసి ఇల్లు, ఆస్థులను కోల్పోయి పూటగడవని స్థితిలో దయనీయంగా బతుకులీడుస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ రిఫార్మ్స్‌ సంస్థ తరుపున వైద్యులు చేసిన సర్వేలో వెలుగు చూసింది. వైద్యానికి చెలత్లించాల్సి ఖర్చులతో ఆర్థికంగా చితికిపోవడంతో కనీసం తినడానికి తిండి లేక మరింత అనారోగ్యం బారిన పడి చితికిపోతున్న కుటుంబాలెన్నో రాష్ట్రంలో ఉన్నాయని ప్రజా వైద్య సంఘాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలోని సామాన్య, పేద ప్రజలు ప్రతి ఏటా తక్కువలో తక్కువ కనీసం దాదాపు 1 లక్ష దాకా వైద్యం కోసం ప్రయివేటు/కార్పోరేటు ఆసుపత్రులకు చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో సర్కారు వైద్యం బలోపేతానికి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ సామాన్యుడు వైద్యం కోసం ప్రయివేటు ఆసుపత్రుల గడప దొక్కాల్సిన పరిస్థితులు అనివార్యంగా పరిణమిస్తున్నాయి. వైద్యానికయ్యే ఖర్చులో ప్రతి ఏటా దేశ ప్రజలు తమ జేబుల్లోంచి 62.4శాతం ఖర్చు చేస్తుంటే… తెలంగాణలోని ప్రజలు ఏటా తమ వార్షిక ఆదాయంలో నుంచి 40శాతం డబ్బులను వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తోంది. అసలే 2020 నుంచి వరుసగా రెండు న్నరేళ్లు కొవిడ్‌ మహమ్మారి రాష్ట్ర ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది.

2014-15 నుంచి 2018 వరకు నాలుగేళ్ల కాలాన్ని పరిశీలిస్తే తెలంగాణ ప్రజల వైద్య ఖర్చుల భారం దాదాపు 40 శాతానికి పెరిగిందని నేషనల్‌ హెల్త్‌ అకౌం ట్స్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం అందిస్త్‌ున్న వైద్య సేవలు పేద, సామాన్యులకు 41శాతం మేరనే అందుబాటులో ఉండగా (ఆరోగ్య శ్రీ, నిమ్స్‌ తరహా ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సీఎంఆర్‌ఎఫ్‌ తదితరాలు), మరో 40శాతం మేర నిధులను తమ జేబుల్లోనుంచి ప్రజలు పయివేటు/కార్పోరేటు ఆసుపత్రులకు చెల్లిస్తున్నారు. మిగతా 11శాతం నిధులను ఇన్సూరెన్స్‌ కంపెనీలు సమకూరుస్తున్నాయి.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నా కూడా ప్రయివేటు/కార్పోరేటు ఆసుపత్రులు వెసే బిల్లులకు అప్పుల పాలు కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వారంపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యే సమయానికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో బిల్లులో దాదాపు 30శాతం కూడా చెల్లించడంలేదని, దాంతో మిగతా 70శాతం బిల్లును తమ జేబుల్లోనుంచి చెల్లించాల్సి వస్తోందని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్న ప్రభుత్వ, ప్రయివేటు వేతన జీవులు వాపోతున్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నా ప్రతి 10 మందిలో ఇద్దరికి ఇదే తరహా పరిస్థితులు ఎదురవుతుండడం గమనార్హం. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు పెడుతున్న పలు కొర్రీలు, పలు రకాల ఛార్జీలతో ప్రయివేటు/కార్పోరేటు ఆసుపత్రులు వేస్తున్న బిల్లులతో సామాన్యుడు జేబు నుంచి చెల్లించక తప్పడం లేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో 0.7శాతం నిధులను వైద్య, ఆరోగ్యరంగానికి ఖర్చు చేస్తుండగా అరుణచాల్‌ ప్రదేశ్‌ తన వార్షిక బడ్జెట్‌లో 4.5శాతం నిధులను ప్రజలకు ఉచిత వైద్యం కోసం ఖర్చు చేస్తోంది.

- Advertisement -

రోజు రోజుకూ వైద్యానికయ్యే వ్యయం పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం అమలుతోపాటు ఆయుశ్మాన్‌ భారత్‌ పథకాన్ని కూడా తెలంగాణలో అమలు చేస్తోంది. 2021-22 ఏడాదికి తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్యరంగానికి రూ.6925కోట్లు కేటాయించగా 2022-23 ఏడాది బడ్జెట్‌లో 11, 237 కోట్లు కేటాయించారు. దాదాపు రూ.4492కోట్ల కేటాయింపులు వైద్య, ఆరోగ్యరంగానికి పెరిగాయి. ప్రజారోగ్యం మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతోపాటు కొత్తగా హైదరాబాద్‌ నలుమూలలా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, పీహెచ్‌సీలు/ ప్రభుత్వాసుపత్రుల బలోపేతం, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. సర్కారు వైద్యం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ ం చేస్తున్న కృషితో సామాన్య, పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వ వైద్య సంఘాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement