Friday, November 22, 2024

Delhi: దేశాభివృద్ధికి కొనసాగింపునకు ఆత్మవిశ్వాసాన్నిచ్చిన బడ్జెట్.. ప్రధాని మోడీ

దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై స్పందించారు. వికసిత్ భారత్‌కు మూలస్తంభాలైన పేదలు, యువత, మహిళలు, అన్నదాతల సాధికారతకు ఈ బడ్జెట్ కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అని కొనియాడారు. ద్రవ్యలోటును అదుపులో ఉంచుతూనే మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లకు చేరుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ దిశగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ. 1 లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేయడం, స్టార్టప్‌లకు పన్ను మినహాయింపును పెంచడం జరిగిందన్నారు.ఈ బడ్జెట్ నిర్ణయాలు 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా యువతకు ఎన్నో కొత్త కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు దారితీస్తాయని పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement