Tuesday, November 19, 2024

ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన వంతెన

బీహార్‌లోని బెగుసరాయ్‌లో గండక్‌ నదిపై నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన కుప్ప కూలింది. బ్రిడ్జి ముందు బాగం కూలి నదిలో పడిపోయింది. ప్రారంభోత్సవానికి ముందే చోటు చేసుకున్న ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.13 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం జరిగింది. నబార్డ్‌ పథకం కింద బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అయితే యాక్సస్‌ రోడ్డు లేకపోవడంతో బ్రిడ్జి ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.

కొద్దిరోజుల క్రితమే బ్రిడ్జి ముందు భాగంలో పగుళ్లను గుర్తించారు. డిసెంబర్‌ 15న ఈ విషయంపై అధికారులకు లేఖ రాయడం జరిగింది. అయితే ఈలోపే బ్రిడ్జి ముందు భాగం కుప్పకూలింది. అ#హూక్‌ గండక్‌ ఘాట్‌ నుంచి ఆక్రిత టోల చౌకి, బిషన్‌పూర్‌ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని 2016లో ప్రారంభించి 2017లో పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement