హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా వైరస్ నాలుగో విడత విజృంభిస్తోంది. నాలుగైదు రోజులుగా ప్రతీ రోజూ 1000కి చేరువలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 984 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులను కలుపుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 24, 179కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 923 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతుండడంతో రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రమాదకరస్థాయిలో పెరుగుతోంది. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఇప్పుడు తెలంగాణలో 6వేలను దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6418 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 98శాతం మంది హోం ఐసోలేషన్ చికిత్సతతోనే కోలుకుంటున్నారు.
కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా టెస్టుల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ప్రతీ రోజూ 40వేల టెస్టులు చేస్తున్నారు. తాజాగా 40, 683 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ ప్రాంతంలో 365, కరీంనగర్లో 37, ఖమ్మంలో 23, మంచిర్యాలలో 30, మేడ్చల్ మల్కాజిగిరి 61, నల్గొండ41, నిజామాబాద్ 34, పెద్దపల్లిలో 21, రాజన్న సిరిసిల్లలో 22, రంగారెడ్డిలో 57, సంగారెడ్డిలో 19, సిద్ధిపేటలో 18, హన్మకొండలో 23, యాదాద్రి భువనగిరిలో 30అత్యధిక కేసులు నమోదయ్యాయి.