హైదరాబాద్, ఆంధ్రప్రభ : కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నా వదలడం లేదు. మూడో వేవ్ తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో రోజువారీ పాజిటివ్ కేసులు 500 సంఖ్యను దాటాయి. మరోవైపు రాష్ట్రంలోని 33 జిల్లాకు గాను జోగులాంబ గద్వాల, వరంగల్ రూరల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితులను పరిశీలిస్తే కరోనా వైరస్ మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా కోరలు చాస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వైరస్ ఇలానే విజృంభిస్తూ పోతే ప్రమాదం తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
కొత్తగా 516 కేసులు నమోదు…
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 516 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోవడంతో 434 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4784కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 26, 976 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 261 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… ఖమ్మంలో 9, కరీంనగర్‌లో 9, మంచిర్యాల 34, మేడ్చల్ మల్కాజిగిరిలో 43, రంగారెడ్డిలో 43, సంగారెడ్డిలో 24 కేసులు నమోదయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.