తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పరీక్షల ఫలితాలు నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఈ ఏడాది పరీక్ష కేంద్రాలు విద్యార్థులకు మరింత దగ్గర ఉన్నాయి. విద్యార్థులు చదివే పాఠశాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ఎగ్జామ్ సెంటర్లు ఉండేలా బోర్డు ఏర్పాట్లను చేస్తోంది.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం మే 17న పరీక్షలు మొదలై 22న పూర్తి కానున్నాయి. ఓరియంటల్ విద్యార్థులకు మూడు రోజులు పరీక్షలు ఉన్నా హాజరయ్యే విద్యార్థులు వందలలో ఉంటారు. అందుకే ఈ మేర బోర్డ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.