పెద్దపల్లి, (ప్రభన్యూస్) : రాష్ట్రంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రభుత్వం పోలీసులను ప్రజలకు చేరువగా తీసుకు వెళ్తోంది.. అయినా కూడా కొన్ని చోట్ల కొంతమంది పోలీసుల తీరు వల్ల పోలీసులు అంటేనే వణుకు పుట్టించే పరిస్థితులున్నాయి. పోలీస్ శాఖ పనితీరులో తెలంగాణా వ్యాప్తంగా తీసుకున్న ర్యాంకింగ్‌లో రామగుండం కమిషనరేట్‌లోని పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్ బెస్ట్‌గా నిలిచింది.
రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్‌లలో పోలీసుల పనితీరును పరిగణలోకి తీసుకొని టాప్ 30 పోలీస్ స్టేషన్‌లను ఎంపిక చేశారు. అందులో పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు 4వ స్థానం దక్కింది. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతోపాటు స్పీడీ డిస్పోజల్‌ను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్ ఇచ్చారు.
కేసుల నమోదు, ప్రాపర్టీ కేసుల్లో సత్వర పరిష్కారం, అట్రాసిటీ కేసుల్లో సత్వర పరిష్కారం, ఫోక్సో కేసుల్లో సత్వర పరిష్కారం తో పాటు రాష్ట్రస్థాయిలో అమలు చేస్తున్న 24 వర్టికల్స్ లో మెరుగైన ప్రతిభ, ఇతర అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని బెస్ట్ పోలీస్‌స్టేషన్‌లను ఎంపిక చేశారు. గత నెలలో పెద్దపల్లి సర్కిల్‌లోని రెండు పోలీస్ స్టేషన్లు బెస్ట్‌గా ఎంపిక కావడం తెలిసిందే. ఈ నెలలో కూడా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ 6 వ స్థానం నుండి 4వ స్థానం కు ఎంపికయింది.
బెస్ట్ 4 గా ఎంపిక కావడం పట్ల రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ ఎడ్ల మహేశ్, సీఐ అనిల్ కుమార్, బసంత్‌నగర్ ఎస్‌ఐ వెంకటేశ్ లను సిపి అభినందించారు. రాష్ట్రంలోని టాప్ 30 పోలీస్ స్టేషన్లో వరుసగా రెండవ నెలలో కూడా బెస్ట్ పోలీస్ స్టేషన్ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనివే కావడం వేశేషం. బెస్ట్ పోలీస్ స్టేషన్ గా ఎంపిక కావడంతో పోలీసులను అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తున్నారు.