Tuesday, November 12, 2024

వందే భారత్‌ సగటు వేగం 83 కిలోమీటర్లే

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సగటున గంటకు 83 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. నిజానికి ఈ రైళ్ల టాప్‌ స్పీడ్‌ గంటకు 180 కిలోమీటర్లు. కానీ రైల్వే ట్రాకులు సరిగా లేని కారణంగాు కేవలం గంటకు 83 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు ఓ ఆర్టీఐ ఫిర్యాదు ద్వారా తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్‌ గౌర్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వందేభారత్‌ రైళ్ల స్పీడ్‌ ఏంతో తెలుసుకున్నారు.

2021-22 సీజన్‌లో ఆ వందేభారత్‌ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఇక 2022-23 సీజన్‌లో ఆ రైళ్లు సగటున కేవలం 81.38 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ రైళ్లకు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగే సామర్థ్యం ఉన్నా.. ట్రాక్‌ కండీషన్స్‌ దృష్ట్యా ఆ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రీతిలో స్పీడ్‌ ఫిక్స్‌ చేశారు. కానీ ఆ లక్ష్యాన్ని కూడా చేరుకోవడం లేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement