అధికారం పార్టీ నాయకుల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. కింద స్థాయి నాయకుల నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు అందరూ ఇష్టారాజ్యంగా వ్యవహిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. కిరాణా సామాను డబ్భులు అడిగినందుకు వ్యాపారిపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఇష్టారాజ్యంగా నోరుపారేసుకున్నారు.
రెండేళ్ల క్రితం రంజాన్ తోఫా కోసం బాన్సువాడ కు చెందిన కిరాణా వ్యాపారి మురళీధర్ తో షకీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. సుమారు 42లక్షల వరకు కిరణ సామగ్రిని మురళీధర్ పంపించాడు. అయితే అందులో 6 లక్షలు చెల్లించగా మిగిలిన బకాయిపడ్డ 36 లక్షలు అడిగితే ఇవ్వకుండా ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఫోన్ లో ఎమ్మెల్యే తన పట్ల మాట్లాడిన మాటలను రికార్డు చేసి బయటపెట్టాడు. మరోవైపు బ్యాంకు లోన్ చెల్లించకపోవడం తో బాధితుని షాపును బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. దీనితో న్యాయం చేయాలని బోధన్ ఏసీపీ ని బాధితులు ఆశ్రయించారు. కాగా ఏసీపీ కూడా కంప్లైంట్ తీసుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.