Friday, November 22, 2024

పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీరం చేసిన ఏపీ సర్కార్.. రాహుల్‌ గాంధీ

కర్నూల్‌ బ్యూరో : పంచాయతీరాజ్‌ వ్యవస్థను క్రమ పద్ధతిలో ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ అన్నారు. భారత్‌ జోడో యాత్రను ఏపీలో ముగించుకొని కర్ణాటకలోనీ రాయచూరులో ప్రవేశిస్తున్న సందర్భంగా మాధవరం బ్రిడ్జిపై హాజరైన ప్రజల ఉద్దేశించి ప్రసంగించారు.. ఏపీ ప్రజలు తన భారత్‌ జూడో యాత్రకు అపారమైన మద్దతు ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది నిజంగా మరపురాని అనుభవంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో యాత్ర సందర్భంగా విభిన్న సమూహాలతో కలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన సమస్యలను వెలుగులోకి వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు- అమరావతిలో ఒకే రాజధానిని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టు-బడి ఉన్నట్లు- పేర్కొన్నారు. భారతీయ ప్రజల ఆస్తిగా విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ యొక్క ప్రభుత్వ రంగ హోదాను కొనసాగించడాన్ని తాము సమర్థిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను క్రమపద్ధతిలో నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజాస్వామ్య సంస్థలపై ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు- పేర్కొన్నారు. గత మూడు రోజులుగా రైతులు, యువత, మహిళలు, కార్మికులతో పరస్పరంగా మాట్లాడితే అనేక సమస్యలు వెలుగు చూసాయి అన్నారు.

2014లో పార్లమెంటు-లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చేసిన వాగ్దానాలను మేము గుర్తు చేస్తున్నాము. ఇవి ఒక వ్యక్తి, ఒక పార్టీ చేసిన హామీలు కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పార్లమెంటు- చేసినవి. ఈ కట్టు-బాట్లను పూర్తిగా, వేగంగా నెరవేర్చాలని నిర్ణయించినట్లు- రాహుల్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. ఏపీలో మనం ఎదుర్కొంటు-న్న సవాళ్ల గురించి కాంగ్రెస్‌ పార్టీకి లోతుగా తెలుసు. రాష్ట్రం గతంలో కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉంది, భారతదేశానికి అత్యుత్తమ రాజనీతిజ్ఞులను తయారు చేసింది. ఆంధ్ర ప్రజల హృదయాలలో, మనస్సులలో కాంగ్రెస్‌ తిరిగి తన పూర్వస్థానానికి చేరుకోవడానికి తాము చేయగలిగినదంతా చేయాలని నిర్ణయించుకున్నట్లు- తెలిపారు. ఈ ప్రయాణంలో భారత్‌ జోడో యాత్ర మొదటి అడుగుగా నిలుస్తుందని తాను నమ్ముతున్నట్లు- పేర్కొన్నారు. ప్రజల వాణినీ, సమస్యలు వినడానికి, మన గొప్ప దేశంలోని ప్రజల రోజువారీ సవాళ్లపై లోతైన అవగాహన పొందడానికి ఈ యాత్ర తనకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇచ్చిందన్నారు. కులం, మతం, భాష, ఆహారం, వేషధారణల ఆధారంగా భారతీయులను ఒకరికొకరు ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ప్రతిరోజూ కొనసాగుతోందన్నారు. ఆకాశాన్నంటు-తున్న ధరలు, రికార్డు స్థాయిలో నిరుద్యోగం కారణంగా ఏర్పడిన అసమానమైన ఆర్థిక సంక్షౌభం, అలాగే రాజకీయ, ఆర్థిక అధికారం కొద్దిమంది చేతుల్లో పెరగడం వంటివన్నీ తీవ్ర ఆందోళన కలిగించే అంశాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున మీ అందరినీ మాతో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు- రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement