Friday, November 22, 2024

కమలంతో దోస్తీకి ప్రసక్తే లేదు.. బీజేపీని ఓడించడమే లక్ష్యం : ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌ చౌదరీ..

బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని, సమాజ్‌వాదీ పార్టీతో కలిసి బీజేపీని గద్దె దించడమే తన ముందు ఉన్న లక్ష్యం అని రాష్ట్రీయ లోక్‌దళ్‌ నేత జయంత్‌ చదరీ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన… సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను నాణంలా ఎగిరే వ్యక్తి కాదని, పశ్చిమ యూపీలో జాట్‌ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తనను కూడా బీజేపీలో చేరేందుకు ఆహ్వానించారని తెలిపారు. కానీ దీన్ని తాను వ్యతిరేకించినట్టు జయంత్‌ చదరీ స్పష్టం చేశారు. జాట్‌ నాయకులతో భేటీ తరువాతే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. షా పిలుపును సున్నితంగా తిరస్కరించినట్టు తెలిపారు. తమ పార్టీ జాతీయ ప్రయోజనాల కోసమే పని చేస్తుందని స్పష్టం చేశారు.

గెలుపు మాదే.. : అఖిలేష్‌

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో.. ఎస్‌పీ, రాష్ట్రీయ లోక్‌ దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) కూటమి తిరుగులేని శక్తిగా అవతరిస్తాయన్నారు. భారీ మెజార్టీతో యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పుకొచ్చారు. తమ కూటమి చివరి వరకు రైతుల శ్రేయస్సు కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. తాను ఆర్‌ఎల్‌డీకి చెందిన నేత జయంత్‌ చౌదరీ.. రైతుల మానస కుమారులుగా అఖిలేష్‌ అభివర్ణించుకున్నారు. తాను ఎప్పుడూ జేబులో ఓ ప్యాకెట్‌ ఉంచుకుంటానని, అవే లాల్‌ టోపి, లాల్‌ పోట్లీ అన్నారు. బీజేపీని ఓడించడమే తన సంకల్పమన్నారు. 2017 నుంచి ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అమలు చేయలేదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement