Saturday, November 23, 2024

సమ సమాజ నిర్మాణమే లక్ష్యం, అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధి.. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

సమ సమాజ నిర్మాణం కోసం తమవంతు కృషి చేస్తున్నామని, పురుషులతో పోలిస్తే.. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని పద్మశ్రీ అవార్డు గ్రహిత, క్లాసికల్‌ డ్యాన్సర్‌, కొరియోగ్రాఫర్‌ డాక్టర్‌ ఆనంద శంకర్‌ జయంత్‌ అభిప్రాయపడ్డారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్‌ ఆనందతో పాటు ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ తైయిల్‌ చిరంజీవి, హైదరాబాద్‌ నర్సింగ్‌ హోం ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ డాక్టర్‌ సీహెచ్‌ వెంటక గంగా హాజరయ్యారు. బ్రీక్‌ ది బియాస్‌ అనేది ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్‌ అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని కోఠిలోని ఎస్‌బీఐ జనరల్‌ మేనేజర్‌ క్రిషణ్‌ శర్మ ప్రారంభించారు.

ఆరోగ్యమైన సమాజంతో పాటు ఆరోగ్యమైన శరీరం ఎంతో ముఖ్యమని, ప్రతీ ఒక్కరు పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్‌ వెంకట గంగా భవానీ సూచించారు. ఆర్థోపెడిక్‌ సర్జరీలో తాను తొలి సర్జన్‌ అని, రీప్లెస్‌మెంట్‌ సర్జరీతో పాటు ట్రామా కేర్‌ స్పెషలిస్టు అని డాక్టర్‌ తైయిల్‌ చిరంజీవి తెలిపారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూలంగా మార్చుకుని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టేలామహిళలు ఎదుగుతున్నారని డాక్టర్‌ ఆనంద జయంత్‌ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ లేడిస్‌ క్లబ్‌ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు. సమాజంలో మహిళలు ఎన్నో అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తున్నారని లేడిస్‌ క్లబ్‌ సభ్యురాలు నుపుర్‌ రి&ుంగ్రాన్‌ అన్నారు. మహిళా ఉద్యోగుల కోసం ఎన్నో వెసులుబాట్లు కల్పించినట్టు ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ రిగ్రాన్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement