Thursday, November 21, 2024

రేపటి నుంచి హైదరాబాద్‌లో 20వ బయోఆసియా సదస్సు.. తొలిరోజు పెద్ద ఎత్తున ప్యానెల్‌ చర్చలు, ప్రదర్శనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక 20వ అంతర్జాతీయ బయో ఆసియా సదస్సు శుక్రవారం ప్రారంభమవనుంది. నేటి నుంచి 26వ తేదీ వరకు హెచ్‌ఐసీసీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో పరిశ్రమ, విద్యాసంస్థలను(అకాడమీ)ని అనుసంధానించడమే లక్ష్యంగా బయో ఆసియా ఫోరం పనిచేస్తోంది. ఇందులో భాగంగా బయోఆసియా సదస్సులను ఈ ఫోరం నిర్వహిస్తోంది. ప్రభుత్వం, నియంత్రణ అథారిటీలు, స్టేక్‌ హోల్డర్లు మధ్య సమన్వయం సాధించి హెల్త్‌కేర్‌ రంగ వృద్ధికి బయో ఆసియా ఫోరం దోహదపడుతోంది. ఈసారి సదస్సు అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌ : షేపింగ్‌ నెక్స్ట్‌ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌ అనే థీమ్‌తో సదస్సు జరగనుంది. భారతదేశ లైఫ్‌సైన్సెస్‌ రంగంలో బయోఆసియా సదస్సుది కీలక పాత్ర వహించనుంది. ఈ సదస్సులో 100కుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నోబెల్‌ అవార్డు గ్రహీతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

- Advertisement -

తొలిరోజు షెడ్యూల్‌ ఇదీ…

సదస్సు తొలిరోజు 10.30కు ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో ఫార్మా దిగ్గజం నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తదితరులు పాల్గొననున్నారు. 11.30 నుంచి 12.00 గంటలవరకు వాస్‌ నరసింహన్‌ కీనోట్‌ ప్రసంగం చేయనున్నారు. 12.30 నుంచి 1.30 వరకు ప్రముఖ లైఫ్‌సైన్సెస్‌ శాస్త్రవేత్తల ప్యానెల్‌ చర్చ ఉండనుంది. 1.30 నుంచి 2.30 వరకు నెట్‌వర్కింగ్‌ లంచ్‌తో పాటు ఎగ్జిబిషన్‌ ఉంటుంది. 2.30 నుంచి 3.45 వరకు హెల్త్‌కేర్‌ ఫర్‌ ఆల్‌, సక్సెసెస్‌, ఛాలెంజెస్‌ అండ్‌ వాట్‌ నెక్ట్స్‌ అనే అంశంపై తిరిగి ప్యానెల్‌ చర్చ ఉండనుంది. తిరిగి 3.50 నుంచి 4.45 వరకు హెల్త్‌కేర్‌లో మెటావర్స్‌ అనే అంశంపై ప్యానెల్‌ చర్చ నిర్వహిస్తారు. 4.45 నుంచి 5.45 వరకు నెట్‌వర్కింగ్‌ విరామం ఇవ్వనున్నారు. 5.45 నుంచి 6.10 వరకు జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు ఇవ్వనున్నారు. యూఎస్‌ మసాచుసెట్స్‌ వర్సిటీకి చెందిన ప్రముఖ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ లాంగర్‌ డేవిడ్‌ హెచ్‌.కోచ్‌ ప్రసంగించనున్నారు. 6.10 నుంచి 7.30 వరకు ఫ్యూచర్‌ గ్రోత్‌ డ్రైవర్‌ వాట్‌ నెక్స్‌ ఫర్‌ ఇండియా అనే అంశంపై చర్చించనున్నారు. సాయంత్రం 7.30కు డిన్నర్‌తో సదస్సు తొలిరోజు మగియనుంది.

బయో ఆసియా సదస్సు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం…

హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు నిర్వహణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుంది. ఈసారి బయో ఆసియా సదస్సులో అనేక దేశాలు భాగస్వామ్య హోదాలో పాల్గొననున్నాయి. జీవశాస్త్రంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బయోఆసియా సదస్సును ఒక వేదికగా వినియోగించుకోనుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న 50 బిలియన్‌ డాలర్ల విలువల గల లైఫ్‌సైన్సెస్‌ పరిశ్రమను 1000 బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా మార్చేందుకు ఈ సదస్సు కీలక పాత్ర పోషించనుంది.

తొలిసారి పాల్గొననున్న ఆపిల్‌ కంపెనీ…

బయో ఆసియా సదస్సుల చరిత్రలో ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ల కంపెనీ ఆపిల్‌ పాల్గొంటోంది. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగంలో విజయవంతమైన కంపెనీ లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా రంగాలకు కీలక వేదికగా ఉన్న బయోఆసియా సదస్సులో పాల్గొంటుండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement