Tuesday, November 26, 2024

ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా తాతా మధుసూదన్ గురువారం పదవీ ప్రమాణం స్వీకరించారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రీ తన చాంబర్‌లో పదవీ ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వీ నరసింహాచార్యులు, తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement