ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20లో విండీస్ అద్భుత విజయాన్ని అందుకుని 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇంగ్లండ్‌పై 20పరుగులు తేడాతో గెలిచి పర్యాటక జట్టుపై ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలుచుకున్న ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 224పరుగులు చేసింది. టీ20ల్లో విండీస్‌కు ఇదే అత్యధిక స్కోరుకావడం విశేషం. విండీస్ మిడిలార్డర్ బ్యాటర్ పావెల్ బ్యాట్‌తో మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. 53బంతుల్లో 4ఫోర్లు, 10సిక్సర్లతో 107పరుగులుతో మెరుపు శతకం సాధించి అజేయంగా నిలిచాడు. విండీస్ ఓపెనర్లు బ్రాండన్‌కింగ్ (10), షాయ్‌హోప్ (4) నిరాశపరిచినా పూరన్, పావెల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. పూరన్, పావెల్ విజృంభణతో మిగిలిన విండిస్ బ్యాటర్లు చేతులెత్తేసినా ఆతిథ్య జట్టు విజయం సాధించింది.
మొత్తంమీద నిర్ణీత 20ఓవర్లలో వెస్టిండీస్ 224/5 స్కోరు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ, గార్టన్, మిల్స్, లివింగ్‌స్టోన్, అదిల్ రషీద్ తలోవికెట్ తీశారు. అనంతరం 225పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లకు 204పరుగులు వద్ద నిలిచిపోయింది. ఇంగ్లండ్ వికెట్‌కీపర్ 39బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లతో 73పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఫిలిప్ సాల్ట్ 24బంతుల్లో 3ఫోర్లు, 5సిక్స్‌లతో 57పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాటర్లు స్వల్పస్కోరుకే వెనుదిరగడంతో వెస్టిండీస్ 20పరుగులు తేడాతో విజయం సాధించింది. ధనాధన్ బ్యాటింగ్‌తో సెంచరీ సాధించిన పావెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..