Friday, November 22, 2024

Spl Story | థార్ vs జిమ్నీ.. మార్కెట్లో పోటాపోటీగా దూసుకెళ్తున్న వేహిక‌ల్స్‌ ఇవే!

కొత్త కొత్త వాహ‌నాలు మార్కెట్‌లోకి వ‌స్తున్నాయి. ఇప్పుడంతా ఎస్‌యూవీల కాలం న‌డుస్తోంది. వీటిలోనూ హై రేంజ్ కార్ల‌పై చాలామంది మోజుప‌డుతున్నారు. ధ‌ర కాస్త ఎక్కువైనా ప‌ర్లేదు కానీ, మంచి ఫీచ‌ర్లు, అంద‌రినీ ఆక‌ట్టుకునే డిజైన్ ఉండాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. వాటిపై ర‌య్‌మ‌ని దూసుకెళ్తూ త‌మ హోదాని, ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు. ఇక‌.. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో కూడా ఇప్పుడు ఇట్లాంటి వాహ‌నాల‌ హ‌వా న‌డుస్తోంది. వాహ‌న రంగంలో థార్ వ‌ర్సెస్ జిమ్నీ అన్న‌ట్టు ప్ర‌స్తుతం పోటాపోటీ నెల‌కొంది. మారుతి సుజుకి జిమ్నీ, మహీంద్రా థార్.. రెండూ ఆఫ్-రోడ్ SUV కార్లు. ఇప్పటికే మార్కెట్‌లో పోటీపడుతున్న జిమ్నీ, థార్ మధ్య ధరలో ఉన్న తేడాలు, రెండు కార్ల మైలేజీ వంటి వాటి విష‌యంలో మోటార్ అన‌లిస్టులు ఏం చెబుతున్నారు.. వాటి వివ‌రాలు ఏంటో తెలుసుకుందాం..

మహీంద్రా థార్, మారుతి సుజుకి జిమ్నీ SUV కార్లు మార్కెట్ లో పోటీ పడుతున్నాయి. థార్ RWD, 4WD వెర్షన్లలో అందుబాటులో ఉంది, అయితే జిమ్నీ 4WD వెర్షన్లలో మాత్ర‌మే అందుబాటులో ఉంది. థార్ పెట్రోల్‌పై 13 kmpl మైలేజీని ఇస్తుండ‌గా.. జిమ్నీ 16.39 నుండి 16.94 kmpl మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి జిమ్నీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 103 bhp శక్తిని, 134 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో పనిచేస్తుంది. ఈ SUV 4WD వెర్షన్ అన్ని వేరియంట్లలో మంచి నాన్య‌త‌క‌లిగి ఉంటుంది. ఇటీవల ప్రారంభించిన జిమ్నీ, జీటా, అల్పా ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

మహీంద్రా థార్ 2.0-లీటర్ Mstalion 150 TGDI పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో పనిచేస్తుంది. థార్ RWD, 4WD ఆప్ష‌న్స్ కూడా పనిచేస్తుంది.

జిమ్నీ ధరలు (ఎక్స్-షోరూమ్)

జెట్టా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ – రూ.12.74 లక్షలు
జెట్టా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ – రూ.13.94 లక్షలు

ఆల్ఫా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ – రూ.13.69 లక్షలు
ఆల్ఫా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ – రూ.14.89 లక్షలు

ఆల్ఫా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (డ్యూయల్ టోన్) – రూ.13.85 లక్షలు
ఆల్ఫా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (డ్యూయల్ టోన్) – రూ.15.05 లక్షలు

మహీంద్రా థార్ ధరలు (ఎక్స్-షోరూమ్)

థార్ LX హార్డ్ టాప్ డీజిల్ MTRWD – రూ.15.17 లక్షలు

Thar LX హార్డ్ టాప్ పెట్రోల్ AT RWD – రూ.16.94 లక్షలు

థార్ AX (O) కన్వర్టిబుల్ టాప్ పెట్రోల్ (MT) 4WD – రూ.17.41 లక్షలు
థార్ AX (O) కన్వర్టిబుల్ టాప్ డీజిల్ (MT) 4WD – రూ.18.11 లక్షలు

థార్ AX (O) హార్డ్ టాప్ డీజిల్ MT 4WD – రూ.18.17 లక్షలు
థార్ LX హార్డ్ టాప్ పెట్రోల్ MT 4WD – రూ.18.26 లక్షలు

థార్ LX కన్వర్టిబుల్ టాప్ డీజిల్ MT 4WD – రూ.19.12 లక్షలు
థార్ LX కన్వర్టిబుల్ టాప్ పెట్రోల్ AT 4WD – రూ.20.05 లక్షలు

థార్ LX హార్డ్ టాప్ డీజిల్ MT 4WD – రూ.19.23 లక్షలు
థార్ LX హార్డ్ టాప్ డీజిల్ AT 4WD – రూ.20.98 లక్షలు.

థార్ LX హార్డ్ టాప్ పెట్రోల్ AT 4WD – రూ.20.16 లక్షలు
థార్ LX కన్వర్టిబుల్ టాప్ డీజిల్ AT 4WD – రూ.20.87 లక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement