మహీంద్రా థార్, మారుతి సుజుకి జిమ్నీ SUV కార్లు మార్కెట్ లో పోటీ పడుతున్నాయి. థార్ RWD, 4WD వెర్షన్లలో అందుబాటులో ఉంది, అయితే జిమ్నీ 4WD వెర్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. థార్ పెట్రోల్‌పై 13 kmpl మైలేజీని ఇస్తుండగా.. జిమ్నీ 16.39 నుండి 16.94 kmpl మైలేజీని ఇస్తుంది.
మారుతి సుజుకి జిమ్నీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 103 bhp శక్తిని, 134 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో పనిచేస్తుంది. ఈ SUV 4WD వెర్షన్ అన్ని వేరియంట్లలో మంచి నాన్యతకలిగి ఉంటుంది. ఇటీవల ప్రారంభించిన జిమ్నీ, జీటా, అల్పా ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది.
మహీంద్రా థార్ 2.0-లీటర్ Mstalion 150 TGDI పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో పనిచేస్తుంది. థార్ RWD, 4WD ఆప్షన్స్ కూడా పనిచేస్తుంది.
జిమ్నీ ధరలు (ఎక్స్-షోరూమ్)
జెట్టా మాన్యువల్ ట్రాన్స్మిషన్ – రూ.12.74 లక్షలు
జెట్టా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ – రూ.13.94 లక్షలు
ఆల్ఫా మాన్యువల్ ట్రాన్స్మిషన్ – రూ.13.69 లక్షలు
ఆల్ఫా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ – రూ.14.89 లక్షలు
ఆల్ఫా మాన్యువల్ ట్రాన్స్మిషన్ (డ్యూయల్ టోన్) – రూ.13.85 లక్షలు
ఆల్ఫా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (డ్యూయల్ టోన్) – రూ.15.05 లక్షలు
మహీంద్రా థార్ ధరలు (ఎక్స్-షోరూమ్)
థార్ LX హార్డ్ టాప్ డీజిల్ MTRWD – రూ.15.17 లక్షలు
Thar LX హార్డ్ టాప్ పెట్రోల్ AT RWD – రూ.16.94 లక్షలు
థార్ AX (O) కన్వర్టిబుల్ టాప్ పెట్రోల్ (MT) 4WD – రూ.17.41 లక్షలు
థార్ AX (O) కన్వర్టిబుల్ టాప్ డీజిల్ (MT) 4WD – రూ.18.11 లక్షలు
థార్ AX (O) హార్డ్ టాప్ డీజిల్ MT 4WD – రూ.18.17 లక్షలు
థార్ LX హార్డ్ టాప్ పెట్రోల్ MT 4WD – రూ.18.26 లక్షలు
థార్ LX కన్వర్టిబుల్ టాప్ డీజిల్ MT 4WD – రూ.19.12 లక్షలు
థార్ LX కన్వర్టిబుల్ టాప్ పెట్రోల్ AT 4WD – రూ.20.05 లక్షలు
థార్ LX హార్డ్ టాప్ డీజిల్ MT 4WD – రూ.19.23 లక్షలు
థార్ LX హార్డ్ టాప్ డీజిల్ AT 4WD – రూ.20.98 లక్షలు.
థార్ LX హార్డ్ టాప్ పెట్రోల్ AT 4WD – రూ.20.16 లక్షలు
థార్ LX కన్వర్టిబుల్ టాప్ డీజిల్ AT 4WD – రూ.20.87 లక్షలు