రక్తదానం చేస్తున్న ప్రతి అభిమానికి నటుడు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్ భవన్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు రక్తదానం చేసిన వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై కార్డులు పంపిణీ చేయగా.. కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… 1998లో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించానన్నారు.
ఆ రోజుల్లో రక్తం కొరత చాలా ఎక్కువగా ఉండేదన్నారు. రక్తదానం చేసేవాళ్లు చాలా తక్కువ మందే ఉండేవారన్నారు. అప్పుడు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. అందుకు తన ఫ్యాన్స్ కూడా సహకరించారన్నారు. ఫ్యాన్స్ గా తన సినిమాలు చూడటం, తనను కలవడం కంటే రక్తదానం చేయడమే ఎక్కువ సంతోషాన్నిస్తుందన్నారు. కరోనా క్రైసిస్ చారిటీ ప్రారంభించినప్పుడు గవర్నర్ ఎంతో ప్రోత్సహించారన్నారు.