ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ఆక్రమణలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్ ని ఆక్రమించుకున్నారు తాలిబన్ లు. తాజాగా ఆదివారం ఉదయం జలాలాబాద్‌లో కూడా తమ జెండాను పాతారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా జలాలాబాద్‌ను తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. దీంతో రాజధాని నుంచి పాకిస్థాన్‌కు ఉన్న రోడ్డు కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది.
సరిహద్దుల నుంచి ప్రారంభమైన ఆక్రమణల పరంపర రాజధాని కాబూల్ వద్దకు చేరింది. కాబూల్ చుట్టూ ఉన్న అన్ని పెద్ద పట్టణాలను ఇప్పటికే తమ ఆధీనంలో తీసుకున్నది. శనివారం కాబూల్‌కు ఉత్తరాన ఉన్న మరో పెద్ద పట్ణమైన మజర్-ఐ-షరీఫ్‌ను ఆక్రమించుకున్నది. తాలిబన్లను చూసి ప్రభుత్వ సైనికులు పారిపోయినట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ వెల్లడించింది. రాజధాని చుట్టూ ఉన్న ముఖ్యమైన పట్టణాలు, నగరాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. కాబూల్‌కు మరింత చేరువయ్యారు. ఈ నేపథ్యంలో కాబూల్‌లోని పౌరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పెద్దఎత్తున సైన్యాన్ని రంగంలోకి దించింది.
ఇది కూడా చదవండి: బిగ్‌బాస్-5 ప్రోమో వచ్చేసింది.. అదరగొట్టిన నాగ్