Friday, November 22, 2024

మాస్క్ ధరించని థాయ్‌లాండ్ ప్రధానికి జరిమానా..

మాస్కు ధరించనందుకు గాను… థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి జనరల్‌ ప్రయూత్‌ చాన్‌-వో-చాకు అధికారులు 6 వేల భాట్‌ల (సుమారు రూ.14,270) జరిమానా విధించారు. అధికారులతో సమావేశం సందర్భంగా ప్రధాని మాస్క్ ధరించనందుకు గాను ఈ జరిమానా విధించారు. వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించి ప్రధాని ప్రయూత్ నిన్న సలహాదారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాస్క్ ధరించలేదు. గమనించిన బ్యాంకాక్ గవర్నర్ అశ్విన్ క్వాన్ ముయాంగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధానిపై తాను ఫిర్యాదు చేసినట్టు గవర్నర్ తన ఫేస్‌‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రధాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో అధికారులు ఆయనకు జరిమానా విధించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా థాయ్‌ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. భారత్‌ నుంచి థాయ్‌ ప్రజలు మినహా మరెవరూ తమదేశం రావద్దని ఆంక్షలు విధించింది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement