నల్గోండ జిల్లాలో ఓ తహశీల్దార్ కి అవమానం జరిగింది. ప్రభుత్వం అధికారికి ఇవ్వాల్సిన కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు అక్కడి ప్రజాప్రతినిధులు. నల్గొండలో జిల్లాలోని PA పల్లి తహశీల్దార్ రేషన్ పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అదే కార్యక్రమానికి ఆ ప్రాంత ఎమ్మెల్యే తో పాటు.. ఇతర టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. సుమారు గంటపాటు రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే వేదిక మీద ఉన్న కుర్చీల్లో అందరు ప్రజాప్రతినిధులు కూర్చున్నారు కాని.. తహశీల్దార్ కు కుర్చోడానికి కూర్చి ఖాలీ లేకుండా పోయింది. దీంతో ఆయన సుమారు గంట సేపు అలా నిల్చోని ఉండిపోయారు. ఓ ప్రభుత్వ అధికారికి కనీసం గౌరవం ఇవ్వకపోతే ఎలా అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ లో ప్రభుత్వ అధికారుల పరిస్థితి ఇది అని.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి : వీడియో: దళితుల కాళ్లు మొక్కిన ఈటల.. !
తహశీల్దార్ కి అవమానం..కుర్చీలు ఆక్రమించిన ప్రజాప్రతినిధులు..
Advertisement
తాజా వార్తలు
Advertisement