Friday, November 22, 2024

TGSRTC | విద్యార్థులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేస్తాం..

రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచుతున్నారని తెలిపారు. అయినా కొన్ని రూట్లలో విద్యార్థుల రద్దీ వీపరీతంగా ఉంటున్న విషయం సంస్థ దృష్టికి వచ్చిందని తెలిపారు.

కాగా, టీజీఎస్ఆర్టీసీకి చెందిన ఒక బ‌స్సులో కొందరు విద్యార్థులు ఫుట్ బోర్డు ప్ర‌యాణం చేస్తోన్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యియి.. దీనిపై ఎండీ స‌జ్జ‌నార్ స్పందిస్తూ…. ఈ విషయం ఆర్టీసీ యాజమాన్యందృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు.

రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణ‌యించిందని.. ఆ దిశ‌గా చ‌ర్య‌లు కూడా తీసుకోవ‌డం జ‌రుగుతోందని తెలిపారు. విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని వెల్లడించారు.

ప్ర‌తి రోజు ల‌క్ష‌లాది మంది విద్యార్థులు ఆర్టీసీ బ‌స్సుల్లోనే త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకుంటున్నారు. విద్యార్థుల‌కు ర‌వాణా ప‌రంగా ఇబ్బందుల్లేకుండా త‌గిన‌న్ని బ‌స్సుల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోంది. కావున, త‌మ‌ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని ఫుట్ బోర్డు ప్ర‌యాణం చేయ‌కుండా స‌హ‌క‌రించాల‌ని విద్యార్థుల‌ను యాజ‌మాన్యం కోరుతోంది.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సంఖ్యలో బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు తమ వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేయ‌వ‌ద్ద‌ని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement