రాష్ట్రంలో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్(కార్గో) సేవలను మరింతగా విస్తరిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్‌లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సేవలను ఆదివారం నుంచి హైదరాబాద్‌లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్‌లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని చెప్పారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా హోం డెలివరీ సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రజలందరూ హోం డెలివరీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ క్రమంలో పార్శిళ్ల హోం డెలివరీ చార్జీలను ప్రకటించారు.
పార్శిళ్ల హోం డెలివరీ చార్జీలివే!
- 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50
- 1.01నుంచి 5 కేజీలకు రూ.60
- 5.01 నుంచి 10 కేజీలకు రూ.65
- 10.1 నుంచి 20 కేజీలకు రూ.70
- 20.1 నుంచి 30 కేజీలకు రూ.75
- 30.1 కేజీలు దాటితే పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధరలు ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.