Sunday, July 7, 2024

TGSRTC | ఫ్రీ బస్సు వల్ల 2500 కోట్ల నష్టం.. : శ్రీనివాస్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే.. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 100 శాతానికి పెరిగిందని.. రికార్డు స్థాయిలో రోజుకు 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నట్టుగా చెప్తున్నారు. కాగా.. ఇందులో 70 శాతం మంది మహిళలే కావటం గమనార్హం.

అయితే, ఈ పథకంపై టీజీఎస్ ఆర్టీసీ డిపార్ట్ మెంట్‌కు చెందిన వాళ్లే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పథకం వల్ల 6 నెలల్లో సంస్థకు 2500 కోట్లు నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ.శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో సుందరయ్య కళానిలయంలో ఫెడరేషన్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన శ్రీనివాస్ రావు… ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో సంస్థకు ఆరు నెలలుగా రోజుకు సుమారు రూ.15 కోట్ల చొప్పున నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల ఆర్టీసీకి 6 నెలల్లో రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీకి ఫ్రీ బస్సు పథకానికి సంబంధించిన డబ్బుల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. అయితే.. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు రూ. 2500 కోట్ల నిధులను సంస్థకు రేవంత్ రెడ్డి సర్కారు తక్షణం చెల్లించాలని టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ.శ్రీనివాస్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement