విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ కీలక సూచన చేసింది. ఆన్లైన్ పేమెంట్ యాప్లు (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే,) బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక నుంచి TGSPDCL వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంట్ బిల్లులను చెల్లించాలి అని పేర్కోంది. ఈ మేరకు వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
http://www.tssouthernpower.com/
- Advertisement -