టీజీపీఎస్సీ చైర్మన్గా నియమితులైన బుర్రా వెంకటేశం ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. తనపై నమ్మకముంచి ప్రతిష్టాత్మకమైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎంపిక చేసిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వం గతంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలుకు సంబంధించి బుర్రాకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.